AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూసుకోవాలి కదమ్మా..! స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. అసలు మ్యాటర్ ఇదే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం స్పిరిట్. ఈ ప్రాజెక్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.

చూసుకోవాలి కదమ్మా..! స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ లీక్.. అసలు మ్యాటర్ ఇదే..
Prabhas
Rajeev Rayala
|

Updated on: May 15, 2026 | 3:01 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చివరిగా ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై రెబల్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదల తర్వాత అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కేవలం ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ప్రభాస్. స్పిరిట్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ తెగ వైరల్ అయ్యింది.

ఇది కూడా చదవండి : నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. చేసిన మూడు సినిమాలతోనే ఇండస్ట్రీలో తోప్ దర్శకుడిగా మారిపోయాడు సందీప్. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు. అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో తెరకెక్కించి అక్కడ కూడా భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేశాడు. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన యానిమల్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు స్పిరిట్ తో రానున్నాడు.

ఇది కూడా చదవండి : OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. . పంచకట్టులో ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పంచెకట్టులో, చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా ఉన్న ప్రభాస్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రభాస్ లుక్ లో నిజం లేదని తెలుస్తుంది. ఆ ఫోటో ఏఐ ద్వారా చేసిందని తెలుస్తుంది. ప్రభాస్ లుక్ లీక్ అనగానే ఫ్యాన్స్ చాలా మంది దాని పై ఆరా తీశారు. దాంతో అసలు విషయం బయట పడింది. ఈ ఫొటోలో ప్రభాస్ వెనక ఉన్న ఓ వ్యక్తి తల భాగం ముందుకి, మిగతాది వెనక్కి ఉండటంతో ఫ్యాన్స్ ఈజీగా కనిపెట్టేశారు.  ఏఐ ఫోటో అయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు.. ఈ లుక్ గాని పడితే థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..

Prabhas New Photo

Prabhas New Photo

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?