Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. ఇద్దరిపై కోట్లు పరువునష్టం దావా వేసిన టీమ్

ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇక 'కల్కి 2898 ఏడీ' సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటించారు. అయితే కల్కి సినిమా పై కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. ఇద్దరిపై  కోట్లు పరువునష్టం దావా వేసిన టీమ్
Kalki 2898 Ad Movie
Follow us

|

Updated on: Jul 19, 2024 | 10:20 AM

‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలై నెల రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా కల్కి కలెక్షన్స్  ప్రభంజనం ఆగలేదు. ఇప్పటికూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు. ‘కల్కి 2898 AD’ సినిమా చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటించారు. అయితే కల్కి సినిమా పై కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కల్కి కలెక్షన్ పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

కల్కి సినిమా పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ బృందం వారిపై రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసింది. పాన్ ఇండియా సినిమాలకు మంచి రివ్యూలు వస్తే 500-1000 కోట్ల రూపాయలను సులువుగా సంపాదిస్తాయి. గత రెండేళ్లలో ‘కేజీఎఫ్ 2’, ‘జవాన్’, ‘పఠాన్’, ‘జైలర్’, ‘లియో’, ‘యానిమల్’ వంటి ఎన్నో సినిమాలు రూ.500-1000 కోట్ల బిజినెస్ చేశాయి. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే, కోల్‌కతాకు చెందిన కొందరు విమర్శకులు సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ కల్కి పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాంతో ‘కల్కి 2898 ఏడీ’ బృందం కోర్టుకు వెళ్లింది. వీరిద్దరిపై రూ.25 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇప్పటికే సుమిత్, రోహిత్‌లకు లీగల్ నోటీసులు పంపారు.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

సుమిత్‌, రోహిత్‌లు ‘సమోసా క్రిటిక్స్‌’గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ‘కల్కి 2898 AD’ సినిమా కలెక్షన్ గురించి ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ‘కల్కి 2898 AD’ కలెక్షన్స్ నకిలీవని చెప్పడానికి ఇద్దరూ సాక్షాలు సమర్పించాలి. అలాగే సినిమా ఎంత వసూళ్లు చేసిందనేది కూడా చూపించాలి. దీంతో పాటు పరువు నష్టం కోసం 25 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్,  దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. ‘కల్కి 2898 AD’  చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!
రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!
రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!
ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు
ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు
ఇక దబిది దిబిదే.. ఏపీలో వచ్చే 3 రోజులు ఫుల్‌గా వర్షాలు..
ఇక దబిది దిబిదే.. ఏపీలో వచ్చే 3 రోజులు ఫుల్‌గా వర్షాలు..
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే