Prabhas: ‘రాజా డీలక్స్’ ప్రభాస్ సినిమా టైటిల్ కాదట.. మరో హీరో కోసం ఆ టైటిల్ ఫిక్స్ చేశారా..?
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.
Prabhas: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ పిరియాడికల్ లవ్ డ్రామా భారీ వసూళ్లను రాబడుతుంది. డార్లింగ్ సినిమా కోసం దాదాపు మూడేళ్లు ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రాధేశ్యామ్ తో సర్ప్రైజ్ చేశారు. మాములుగా ప్రభాస్ సినిమా అంటే భారీ యాక్షన్ సన్నివేశాలను ఊహించుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. కంప్లీట్ లవ్ దడ్రామాగా వచ్చిన రాధేశ్యామ్ మొత్తానికి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే , బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమాలు కమిట్ అయ్యే ఉన్నాడు రెబల్ స్టార్
అయితే వీటితో పాటు దర్శకుడు మారుతి తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ టాల్ హీరో. ప్రభాస్ తో మారుతి చేయబోయే సినిమా హరర్ కామెడీ అని ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా పెట్టేశారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై మారుతి ఇటీవల స్పందించారు. తాను చెప్పేవరకూ వెయిట్ చేయమని మారుతి స్పందించాడు. ఇదిలా ఉంటే రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రభాస్ సినిమా కోసం కాదట. మారుతి రవితేజతో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మాస్ రాజాతో చేసే సినిమా కోసం ఈ టైటిల్ ను అనుకున్నాడట మారుతి. రవితేజతో మారుతి ఈ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. ప్రభాస్ తో చేయనున్న సినిమా టైటిల్ ను త్వరలోనే మారుతి ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో ఉండనుందట. చూడాలి మరి ఈవార్తల్లో వాస్తవమెంతో..
మరిన్ని ఇక్కడ చదవండి :