AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej : ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదనే అంత కష్టపడ్డా.. ఆసక్తికర విషయం చెప్పిన మెగా ప్రిన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి పంచులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. వరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని. ఈ మూవీని కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.

Varun Tej : ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదనే అంత కష్టపడ్డా.. ఆసక్తికర విషయం చెప్పిన మెగా ప్రిన్స్
Gani
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2022 | 9:24 AM

Share

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి పంచులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. వరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని. ఈ మూవీని కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది ఈ మూవీ. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తుంది.  యూట్యూబ్ లో టెండింగ్ లో ఉంది ఈ ట్రైలర్.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ఏదైనా చేస్తాను. కరోనా సమయంలో కూడా కష్టపడి ఈ సినిమా చేశాము అన్నారు. కచ్చితంగా ఇది మిమ్మల్ని అలరిస్తుంది అని నమ్ముతున్నాను. గద్దలకొండ గణేష్ సినిమా ముందు నుంచే యూఎస్ లో బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. సినిమాలో ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..’ బాక్సింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ తో కూడుకున్న ఎమోషనల్ కథ. ఈ నేపథ్యంలో సినిమా చేస్తాము అని చెప్పినప్పుడు ఎందుకు తీసుకున్నారో అనుకున్నాను. ఆ తర్వాత కేవలం బాక్సింగ్ మీద నడిచే 2,3 ఇంగ్లీష్ సినిమాలు చూశాను. ఈ సినిమా గురించి ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నాడు వరుణ్ తేజ్. దర్శకుడు కిరణ్ తో కూర్చుని ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకున్నాడు. బాక్సింగ్ ఉన్నా కూడా ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఖచ్చితంగా దీన్ని చూడటానికి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. వస్తారు అని నమ్మకం కూడా ఉంది. ఇందులో కేవలం వరుణ్ తేజ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా 50 శాతం కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకున్నాడు. ఈ టీమ్ అంతా కలిసి చేసిన ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుంది..’ అని అల్లు అరవింద్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్