రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. 21 ఏళ్ళ తర్వాత రీరిలీజ్ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వరుసగా సినిమాలను లైనప్ చేశారు ప్రభాస్. వరుస సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. వరుసగా లైనప్ చేసిన సినిమాలతో షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నారు. కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కొన్ని నెలలుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ సినిమాలు రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. అయితే ఈలోగా ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హంగామా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి, అంతే కాదు రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందని తెలుస్తుంది.
ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ , కల్ట్ క్లాసిక్ సినిమా వర్షం. శోభన్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ప్రభాస్ కు మొదటి బ్లాక్ బస్టర్ ఈ సినిమా.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించటానికి రెడీ అవుతుంది. దాదాపు 21 ఏళ్ళ తర్వాత వర్షం సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ ఏడాది మే 23న వర్షం రీ-రిలీజ్ కానుందంటూ పోస్టర్ రివీల్ అయింది. దాంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.