Baahubali The Epic : రెండు సినిమాలు కలిపి ఒక్కటిగా.. ప్రభాస్ బాహుబలి: ది ఎపిక్ టీజర్ చూశారా?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 'బాహుబలి: ది బిగినింగ్ 2015లో రిలీజ్ కగా, 2017లో బాహుబలి: ది కంక్లూజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పుడీ రెండు సినిమాలు ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా రి రిలీజ్ కానుంది.

‘బాహుబలి’.. తెలుగు సినిమా గొప్ప తనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతోనే పాన్ ఇండియా పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే హీరోగా ప్రభాస్ కు ఎనలేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది. భారతీయ సినిమా రికార్డులను తిరగరాసేసిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలవుతోంది. గతంలో ‘బాహుబలి’ రెండు భాగాలుగా విడుదలైంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఒకే భాగంగా రి రిలీజ్ చేస్తున్నారు. భారతీయ సినిమా గతిని మార్చిన ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలను అనేక మార్పులు, చేర్పులు చేసి ఇప్పుడు ఒకే సినిమాగా మార్చారు. ఈ చిత్రానికి ‘బాహుబలి: ది ఎపిక్’ అని పేరు పెట్టారు. : ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా అక్టోబర్ 31న ‘బాహుబలి: ది ఎపిక్’ రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం (ఆగస్టు 26) ఈ సినిమా టీజర్ విడుదలైంది.
‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా టీజర్‌ను యూట్యూబ్ లో విడుదల చేశారు మేకర్స్. ససుమారు ఒక నిమిషం 15 సెకన్ల నిడివి గల ఈ టీజర్ చూడడానికి చాలా కొత్తగా ఉంది. బాహుబలి రెండు భాగాల్లోని కీలకమైన సన్నివేశాలను ఈ టీజర్ లో చేర్చారు. అలాగే నేపథ్య సంగీతం కూడా కొత్తగా ఉంది. సినిమాను సాంకేతికంగా కూడా అప్‌గ్రేడ్ చేశారు. డాల్బీ టెక్నాలజీతో పాటు సౌండ్ క్వాలిటీ, విజువల్ క్వాలిటీకి మరిన్ని మెరుగులు దిద్దారు. డాల్బీ సినిమాస్ సహాయంతో ఈ చిత్రం IMAX, 4DX, D-BOX, EPIQ లలో అందుబాటులో ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని పేర్కొంది.
అక్టోబర్ 31న రిలీజ్..
Here’s the Teaser of @ssrajamouli’s #BaahubaliTheEpic… In cinemas worldwide Oct 31, 2025. https://t.co/KSuKxSwZI9#Prabhas@RanaDaggubati @MsAnushkaShetty @tamannaahspeaks @Shobu_ #PrasadDevineni #Baahubali #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/EXQsQGFoZ8
— Baahubali (@BaahubaliMovie) August 26, 2025
‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా నిడివి 3:30 గంటలు ఉంటుందని చెబుతున్నారు. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలు వరుసగా 2015, 2017లో విడుదలయ్యాయి. మొదటి పార్ట్ దాదాపు 700 కోట్లు వసూలు చేయగా, రెండో భాగం ఏకంగా 2000 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒక భాగంగా రిలీజ్ అవుతోంది. మరి ఈసారి ఎన్ని కలెక్షన్లు వస్తాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








