Kalki 2898 AD: కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి ట్రైలర్ వచ్చేస్తుంది

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్, బుజ్జి గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే బుజ్జి, భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను కూడా విడుదల చేశారు.

Kalki 2898 AD: కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి ట్రైలర్ వచ్చేస్తుంది
Kalki 2898 Ad
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2024 | 11:09 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్, బుజ్జి గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే బుజ్జి, భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను కూడా విడుదల చేశారు. ఈ సిరీస్ కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. దీనితో సినిమా ఎలా ఉండబోతుంది’. అందులో ప్రభాస్ పాత్ర అలాగే  బుజ్జి రోబో పాత్ర ఎలా ఉంటుందో చూపించారు.

కల్కి సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ముంబై లో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. కల్కి మూవీ ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ ప్ పోస్ట్ ను షేర్ చేశారు. కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది అని కల్కి పోస్టర్ ను షేర్ చేశారు మేకర్స్.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది. ప్రభాస్ ఎలాంటి డైలాగ్స్ తో అదరగొడతారు అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు విడుదలైన బుజ్జి గ్లింప్స్, యానిమేషన్ సిరీస్ చూస్తుంటే కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర మరీ అంత సీరియస్ గా ఉండదని అర్ధమవుతుంది. అంతకు ముందు వచ్చిన సలార్ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. డైలాగ్స్ కూడా పెద్దగా చెప్పకుండా యాక్షన్ తోనే అదరగొట్టాడు డార్లింగ్. కానీ ఈసినిమాలో అలా కాదు అని యాక్షన్ తో పాటు ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తోనూ ఆకట్టుకుంటాడని అర్ధమవుతుంది. ఇక కల్కి సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక బుజ్జి అనే రోబోకు కీర్తిసురేష్ వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే