Johnny Movie: పవర్ స్టార్ క్రేజీ మూవీ జానీకి 20 ఏళ్లు.. ఇప్పటికీ ఫ్యాన్స్ ఫెవరెట్ సినిమా..
ఖుషీ సినిమా తరువాత పీక్ క్రేజ్‌లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్నీ తానై జానీ సినిమా చేశారు. గీతా ఆర్ట్స్‌లో.. చాలా ప్రెస్టీజియస్ ఈ మూవీ తెరకెక్కించారు. బాస్‌కెట్ బాల్‌ను వేలితో తిప్పుతూ..

అప్పటికే ఫిల్మ్ లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్.! ఖుషీ సినిమాతో.. అయిపోయారు ఆల్మోస్ట్ నెంబర్ వన్ స్టార్.! ఆ తరువాతే డైరెక్టర్ అవతారమెత్తారు..! రిజల్ట్ పక్కకు పెడితే.. ఆ సినిమాతో ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు ఎవగ్రీన్ క్లాసికల్ డైరెక్టర్. ఇక తాను డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 20 ఏళ్లు కంప్లీట్ చేసుకోవడంతో.. మళ్లీ సోషల్ మీడియలో అవుతున్నారు ఓ రేంజ్లో వైరల్. ఖుషీ సినిమా తరువాత పీక్ క్రేజ్‌లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్నీ తానై జానీ సినిమా చేశారు. గీతా ఆర్ట్స్‌లో.. చాలా ప్రెస్టీజియస్ ఈ మూవీ తెరకెక్కించారు. బాస్‌కెట్ బాల్‌ను వేలితో తిప్పుతూ.. తలకు కట్టుకున్న జానీ కర్చీవ్ ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మోస్ట్ అవేటెడ్ పవన్ సినిమాగా జానీ సినిమా అంతటా వైరల్ అయ్యేలా.. ఈ సినిమా కోసమే అందరూ వెయిట్ చేసేలా చేశారు.
కానీ అప్పటి వరకు తను చేసిన సినిమాలా.. మరీ ఎక్కువ కమర్షియల్ గా జానీ సినిమా ఉండకపోవడమో.. లేక సాడ్ స్టోరీ అనే ఫీలింగో కానీ.. ఆ సినిమాతో బాక్సాఫీస్ ముందు చతికల పడ్డారు పవన్. కానీ డైరెక్టర్‌గా మాత్రం నూటికి నూరు మార్కులు పడేలా చేసుకున్నారు. తన డైరెక్షన్ స్కిల్స్‌తో క్లాసికల్ డైరెక్టర్లను కూడా మెప్పించారు.




ఇక ఇదంతా పక్కు పెడితే..! ఈ సినిమా సరిగ్గా ఇదే రోజు అంటే ఏప్రిల్ 25న.. 2003లో రిలీజై నేటికి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. దీంతో పవన్ జానీ ని మరో సారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. గుర్తు చేసుకోవడమే కాదు.. సోషల్ మీడియాను మొత్తం జానీ మీడియాగా మార్చేశారు.




