Upadrasta Sunitha: సింగర్ సునీత భర్తకు బెదిరింపు కాల్స్.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రాణహాని ఉందని గాయని సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి నుండి తనకు ,తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేసిన రామకృష్ణ. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని సాగర్ సొసైటీలో నివాసం ఉంటున్న వీరపనేని రామకృష్ణకు..
సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రాణహాని ఉందని గాయని సునీత భర్త రామకృష్ణ వీరపనేని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి నుండి తనకు,తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని సాగర్ సొసైటీలో నివాసం ఉంటున్న వీరపనేని రామకృష్ణకు గత కొన్ని నెలలుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్లు చేస్తున్నాడు. తాను సినీ నిర్మాతల మండలి సభ్యుడిని అని, అర్జెంట్‌గా కలిసి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలంటూ రామకృష్ణకు మెసేజ్‌లు పెట్టడంతో పాటు కాల్స్ చేస్తున్నాడు.
రోజు మెసేజ్లతో వేధిస్తుండడంతో పాటు చంపేస్తాను అంటూ రామకృష్ణ ను బెదిరిస్తున్నాడు లక్ష్మణ్.. దాంతో లక్ష్మణ్ నెంబర్ ను బ్లాక్ చేశారు రామకృష్ణ. మార్చి 28న మరొక కొత్త నెంబర్ నుంచి మెసేజ్లు పంపడంతో వారం రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రామకృష్ణ. ఈ మేరకు