AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: మెడికో స్టూడెంట్‌ ప్రీతి చనిపోయినట్లు ట్వీట్‌.. అడ్డంగా బుక్కైన హీరోయిన్‌.. నెటిజన్ల ఫైర్‌

సామాజిక అంశాలు, సమస్యలపై సెలబ్రిటీలు స్పందించడం సర్వ సాధారణం. ఇది వారిని అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. అయితే ఇష్యూ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అరకొర అవగాహనతో స్పందిస్తే మాత్రం..

Poonam Kaur: మెడికో స్టూడెంట్‌ ప్రీతి చనిపోయినట్లు ట్వీట్‌.. అడ్డంగా బుక్కైన హీరోయిన్‌.. నెటిజన్ల ఫైర్‌
Poonam Kaur
Basha Shek
|

Updated on: Feb 26, 2023 | 6:20 AM

Share

సామాజిక అంశాలు, సమస్యలపై సెలబ్రిటీలు స్పందించడం సర్వ సాధారణం. ఇది వారిని అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. అయితే ఇష్యూ గురించి పూర్తిగా తెలుసుకోకుండా అరకొర అవగాహనతో స్పందిస్తే మాత్రం ప్రశంసలకు బదులు నెగటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రముఖ సినీనటి పూనమ్‌ కౌర్‌ పరిస్థితి ఇప్పుడు ఇలాగే అయ్యింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి అత్మహత్యాయత్నం కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.ఇప్పటికే దీనిపై చాలా మంది ప్రముఖులు, రాజకీయ వేత్తలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రీతికి న్యాయం జరగాలంటూ ఆందోళనలు, ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఘటన లవ్‌ జిహాదీ అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు కాస్తా రాజకీయ రంగు పులుముకున్నట్లయింది. అయితే ప్రీతిపై సైఫ్ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే ఈ దారుణ ఘటనలో ప్రీతి ఇంకా ప్రాణాలతో పోరాడుతుంది. ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తున్నారని, వెంటిలేటర్ మీద ఉందని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు చెబుతున్నారు. అయితే ఆమె ఇంకా ప్రాణాలతో బతికే ఉన్నా కూడా పూనమ్ కౌర్ మాత్రం వింతగా ట్వీట్ వేసింది. ప్రీతి చనిపోయినట్లు ట్విట్టర్‌లో పేర్కొనడంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.

‘మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘కాస్త తెలుసుకుని ట్వీట్లు వేయండి.. ఆమె ఇంకా బతికే ఉంది.. మీరు ఇలా ఇష్టమొచ్చినట్టుగా ట్వీట్లు వేయొద్దు’ అని తిడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..