Payal Rajput : హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పై పోలీస్ కేసు.. కొత్త చిక్కుల్లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్
ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుని తన మత్తులో పడేసిన చిన్నది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే మొహమాటం లేకుండా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది...
Payal Rajput : ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుని తన మత్తులో పడేసిన చిన్నది పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మొహమాటం లేకుండా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ ఈ అమ్మడికి ఆ రెంజ్ హిట్స్ పడలేదు. వెంకటేష్ సరసన వెంకీ మామ, రవితేజ కు జోడీగా డిస్కోరాజా వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక పోయాయి. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా పాయ రాజ్ పుత్ పై పోలీస్ కేసు నమోదైంది. ఆమె పై పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు నమోదైంది. అసలు విషయం ఏంటంటే..
గత నెల 11న పెద్దపల్లి పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. జూనియర్ సివిల్ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయనతెలిపారు. షాప్ ఓపినింగ్ ఏమో కానీ ఈ ముద్దుగుమ్మ లేనిపోని కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ హాట్ బ్యూటీ పై ఇలా కేసు నమోదు అవ్వడంతో పాయల్ ఫ్యాన్స్ కొంచం హార్ట్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :