AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు మువీ RRRపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే?

తెలుగు సినిమాకు పాన్‌ ఇండియా స్థాయి కల్పించిన రాజమౌళిని ప్రధాని మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన RRR మువీలోని నాటానాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ పొందిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు ఏకంగా ఆస్కార్ కూడా దక్కింది. ఈ విషయాన్ని వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ గుర్తు చేశారు..

తెలుగు మువీ RRRపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంతకీ ఏమన్నారంటే?
PM Narendra Modi Hails RRR
Srilakshmi C
|

Updated on: May 01, 2025 | 8:08 PM

Share

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం (మే 1) ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ (వేవ్స్ 2025)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో పలువురు సినీ ప్రముఖుల గురించి ప్రస్తావించారు. రజనీకాంత్, మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, రాజ్ కపూర్, సత్యజిత్ రే, ఎఆర్ రెహమాన్, ఎస్ఎస్ రాజమౌళి వంటి పలువురు సినిమా దిగ్గజాలను ప్రశంశించారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాలకు దక్కిన ప్రజాదరణను నొక్కిచెప్పారు.

ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మువీలోని నాటానాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ పొందిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటకు ఏకంగా ఆస్కార్ కూడా దక్కింది. ఈ విషయాన్ని వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారతీయ సమస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించిందన్నారు. ఆర్ఆర్‌ఆర్‌కు ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనమన్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం, రాజమౌళి సినిమాలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తీసుకువెళ్లిందని అన్నారు. రష్యాలో రాజ్ కపూర్ పాపులారిటీ, కేన్స్‌లో సత్యజిత్ రే పాపులారిటీ, ఆస్కార్‌లో ఆర్‌ఆర్‌ఆర్ విజయం సాక్ష్యమని వేవ్స్ సదస్సులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వేవ్స్ 2025 సదస్సులో మోదీ భారతీయ సినిమాకు చెందిన ఐదుగురు దిగ్గజ వ్యక్తులపై స్మారక పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేసారు. ఆ ఐదుగురు.. గురుదత్, పి భానుమతి, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, సలీల్ చౌదరి. కాగా వేవ్స్ సదస్సు మే 1 నుంచి మే 4 వరకు జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.