Puneeth Raj Kumar: మా గుండెల్లో నీస్థానం సుస్థిరం.. పునీత్‌ను కడసారి చూసేందుకు 10లక్షల మందికి పైగా..
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నటుడిగా .. మంచి మనసున్న వ్యక్తిగా లక్షలాది మంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పునీత్

Puneeth Raj Kumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నటుడిగా .. మంచి మనసున్న వ్యక్తిగా లక్షలాది మంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పునీత్ అకస్మాత్తుగా మనమధ్య నుంచి మాయమయ్యారు. మొన్నటివరకు నవ్వుతూ సందడిగా కనిపించిన వ్యక్తి ఇక లేడని, తిరిగి రాడని తెలిసిన దగ్గరనుంచి అందరి హృదయాలు ద్రవించిపోతున్నాయి. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ హాస్పటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ మూగబోయింది. ఇంత చిన్న వయసులు పునీత్ అందరిని వదిలి వెళ్లిపోవడం ఏంటి..? ఇందంతా కల అయితే బాగుండు అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. పునీత్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు కుటుంబసభ్యులు. ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి.
రెండు రోజులుగా లక్షలాది మంది అభిమానుల సందర్శన అనంతరం ఆదివారం తెల్లవారు జామున అంతిమయాత్ర ప్రారంభమైంది. కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది ప్రముఖుల మధ్య అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్యేకించి సాంప్రదాయం ప్రకారం కొంతమంది స్వామీజీలు ప్రత్యేక పూజలు నిర్వహించి అత్యంత శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారం నిర్వహించారు. పునీత్ రెండో అన్న కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున వరకు పునీత్ పార్థీవ దేహం కడసారి చూసేందుకు అభిమానులు బారులు తీరారు. మొత్తంగా 10 లక్షల మందికి పైగా అభిమానులు పునీత్ ను కడసారి చూసేందుకు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. బరువెక్కిన గుండెలతో పునీత్ రాజ్ కుమార్‌కు తుది వీడ్కోలు పలికారు కుటుంబసభ్యులు.. అభిమానులు.
మరిన్ని ఇక్కడ చదవండి :




