Peddi Movie: ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. పెద్ది పవర్‌ఫుల్ మాస్ జాతర..
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న చరణ్.. ఇప్పుడు పెద్ది సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చేస్తోన్న రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఇదిలా ఉంటే.. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ వీడియోలో మాస్ అవతార్ లో చరణ్ లుక్ ప్రేక్షకులకు కన్నుల పండగగా కనిపిస్తుంది. “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.” అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ మాత్రం అదిరిపోయింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చరణ్ ఆటకూలీగా కనిపించనున్నాడని టాక్.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు రామ్ చరణ్. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మాస్ యాక్షన్ పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Here's the #PeddiFirstShot ▶️ https://t.co/gk2wGOWFMo
Happy Sri Rama Navami ✨#PEDDI will see you in cinemas 27th March, 2026.@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @IamJagguBhai @divyenndu @vriddhicinemas @SukumarWritings… pic.twitter.com/xDe7a8N8Fa
— Ram Charan (@AlwaysRamCharan) April 6, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..