మీటూ తర్వాత కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ఉంది..

మీటూ తర్వాత కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ఉంది..

ఆర్ఎక్స్ 100 తో పాయల్ రాజ్‌పుత్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం పాయల్ వెంకటేశ్ సరసన వెంకీమామ, రవితేజతో డిస్కోరాజా, తేజాస్ ఆర్‌డీఎక్స్ లవ్ మూవీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాని ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కూడా కనిపించనుంది. చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ ప్రజెంట్ తీరికలేకుండా బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీటూ ఉద్యమం జరిగినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఇంకా నశించలేదని చెప్పుకొచ్చింది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 29, 2019 | 10:02 PM

ఆర్ఎక్స్ 100 తో పాయల్ రాజ్‌పుత్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం పాయల్ వెంకటేశ్ సరసన వెంకీమామ, రవితేజతో డిస్కోరాజా, తేజాస్ ఆర్‌డీఎక్స్ లవ్ మూవీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాని ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కూడా కనిపించనుంది. చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ ప్రజెంట్ తీరికలేకుండా బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీటూ ఉద్యమం జరిగినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఇంకా నశించలేదని చెప్పుకొచ్చింది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్టు చెప్పింది. హిందీలో సీరియల్స్, పంజాబ్‌లో సినిమాలు చేసినప్పడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందంటూ చెప్పుకొచ్చింది. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమనే వారు చాలామంది ఎదురయ్యారైనట్టుగా చెప్పింది. అయితే తాను ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం వల్ల తనకు అవకాశాలు రావడం లేదంటూ నిట్టూర్పు విడిచింది పాయల్.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu