‘కేజీఎఫ్’చాప్టర్ 2 షూటింగ్ నిలిచిపోయింది.. ఎందుకంటే..!

కన్నడ నటుడు యశ్ నటించి సంచలనం సృష్టించిన హైరేంజ్ యాక్షన్ మూవీ కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. కన్నడలో తీసిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై చరిత్ర సృష్టించింది. మొదటి చిత్రానికి సీక్వెల్‌గా సెకెండ్ పార్ట్‌కు ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా ఈచిత్రం షూటింగ్ నిలిపివేయాలని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ […]

'కేజీఎఫ్'చాప్టర్ 2 షూటింగ్ నిలిచిపోయింది.. ఎందుకంటే..!
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 5:31 PM

కన్నడ నటుడు యశ్ నటించి సంచలనం సృష్టించిన హైరేంజ్ యాక్షన్ మూవీ కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. కన్నడలో తీసిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై చరిత్ర సృష్టించింది. మొదటి చిత్రానికి సీక్వెల్‌గా సెకెండ్ పార్ట్‌కు ఇటీవల షూటింగ్ మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా ఈచిత్రం షూటింగ్ నిలిపివేయాలని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం సైనైడ్ హిల్స్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ వల్ల స్ధానికంగా పర్యావరణానికి విఘాతం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు సినిమా చిత్రీకరణ నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించి అధీరా పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినీ జనాల్లో హైప్ క్రియేట్ చేసింది.