Saaho Movie: సాహో మూవీకి.. కులం లింక్: వర్మ ట్వీట్

భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచానాలతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. బాహుబలి చిత్రంతో తెలుగు సినీ చరిత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు తాజాగా హీరో ప్రభాస్‌ పేరుతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రభాస్ ది నా కులమే.. అతని సినిమా సాహో కోసం నేను […]

Saaho Movie: సాహో మూవీకి.. కులం లింక్: వర్మ ట్వీట్
Ram Gopal Varma

భారీ బడ్జెట్‌తో నిర్మించిన సాహో మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ పై భారీ అంచానాలతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. బాహుబలి చిత్రంతో తెలుగు సినీ చరిత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు తాజాగా హీరో ప్రభాస్‌ పేరుతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రభాస్ ది నా కులమే.. అతని సినిమా సాహో కోసం నేను కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాను. ప్రభాస్ నా కులం వాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని వర్మ అన్నాడు. దీనిపై మళ్లీ స్పందిస్తూ భీమవరంలో ఏర్పాటు చేసిన ప్రభాస్ సాహో ఫ్లెక్సిల వీడియోని పోస్ట్ చేస్తూ భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి అంటూ పోస్టు పెట్టాడు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ సాకుతో ప్రభాస్ సాహో మూవీని వర్మ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు.