#HBDPawanKalyan : కళింగపట్నంలో ఆకట్టుకుంటున్న పవన్ సైకత శిల్పం
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు నేడు. అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. దీంతో ఫ్యాన్స్..పవన్‌కు విభిన్న పద్దతుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు నేడు. అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. దీంతో ఫ్యాన్స్..పవన్‌కు విభిన్న పద్దతుల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ బాధ్యుడు చైతన్య పవన్ సైకత శిల్పాన్ని రూపొందించారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం సముద్ర తీరంలో ఇసుకతో పవన్ రూపాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇక పవన్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ‘ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరోవైపు, పవన్ కొత్త సినిమాలకు సంబంధించి బుధవారం వరుస అప్‌డేట్‌లు రానున్నాయి.
Also Read :