షూటింగ్‌లో పాల్గొన్న రకుల్

రకుల్ మొదలెట్టెసింది. చిత్రపరిశ్రమల్లోని హీరోలు, హీరోయిన్లు షూటిగ్స్ ప్రారంభించడంతో.. తాను కూడా తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు రకుల్. డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో...

షూటింగ్‌లో పాల్గొన్న రకుల్
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 01, 2020 | 9:39 PM

రకుల్ మొదలెట్టెసింది. చిత్రపరిశ్రమల్లోని హీరోలు, హీరోయిన్లు షూటిగ్స్ ప్రారంభించడంతో.. తాను కూడా తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్, వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి ఇవాళ షూటింగ్‌లో పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు సమీపంలోని వికారాబాద్ ‌ఫారెస్ట్‌లో షూట్ నిర్వహించారు. 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసేందుకు స‌న్నాహాలు వేగంగా చేస్తున్నారు క్రిష్‌. ఎం.ఎం.కీర‌వాణి, మ్యూజిక్ అందిస్తుండగా… జ్ఞాన శేఖ‌ర్ కెమెరా వ‌ర్క్ చేస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సాయి బాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రోవైపు వైష్ణ‌వ్ తేజ్ మొద‌టి చిత్రం ఉప్పెన విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్లు రీఓపెన్ అయ్యాకే రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్సయ్యారు.