అప్పుడే భారత ఆర్థిక పతనం మొదలైంది
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నుంచే భారత ఆర్ధిక వ్యవస్థ విచ్ఛిన్నం ప్రారంభమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆపై వరుసగా మోదీ సర్కారు తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందన్నారు. అటు, ప్రియాంక గాంధీ..
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నుంచే భారత ఆర్ధిక వ్యవస్థ విచ్ఛిన్నం ప్రారంభమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఆపై వరుసగా మోదీ సర్కారు తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందన్నారు. అటు, ప్రియాంక గాంధీ కూడా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రభుత్వానిదే బాధ్యతని ఆమె ఆరోపించారు. ఆర్థిక సునామీపై రాహుల్ గాంధీ ఆరు నెలల కిందటే హెచ్చరించినా ప్రభుత్వం కంటితుడుపుగా ప్యాకేజ్‌ను ప్రకటించిందని, ఇప్పుడు వాస్తవ పరిస్థితి కళ్లెదుట కనిపిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. అటు, కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా సైతం జీడీపీ పతనంపై మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోదీజీ.. మీరు ఒకప్పుడు అద్భుత అస్త్రాలుగా అభివర్ణించినవి తుస్సుమన్నాయని ఇప్పుడైనా అంగీకరించండంటూ ఆయన సెటైర్లు వేశారు.