యువకుడిపై కక్ష కట్టిన పాము.. ఒకే నెలలో 8 సార్లు కాటు
పాములు కక్ష కడుతుంటాయని తరచుగా వింటూనే ఉంటాము. అలా ఓ పాము ఓ యువకుడిని ఒకే నెలలో ఎనిమిది సార్లు కరిచిందట
snake bit him 8 times: పాములు కక్ష కడుతుంటాయని తరచుగా వింటూనే ఉంటాము. అలా ఓ పాము ఓ యువకుడిని ఒకే నెలలో ఎనిమిది సార్లు కరిచిందట. ఇన్నిసార్లు కాటేసినా.. అతడు బతికి బట్టకట్టడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా రామ్‌పూర్‌కి చెందిన యశ్‌రాజ్ మిశ్రా అనే వ్యక్తి పాము కాటుతో ఒకే నెలలో ఎనిమిది సార్లు ఆసుపత్రిలో చేరాడట. ఇక చివరగా వారం క్రితం అతడిని పాము కరవగా.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
దీనిపై యశ్‌రాజ్ తండ్రి మాట్లాడుతూ.. నా కుమారుడిని పాము మూడోసారి కరిచిన తరువాత మా బంధువుల ఇంటికి పంపాము. అయితే అక్కడికి కూడా వెళ్లిన పాము మా అబ్బాయిని కాటేసింది. ఆ పాము యశ్‌రాజ్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందో తెలీడం లేదు. ఇలా జరగడం వలన మా కుమారుడు మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా పూజలు చేయించాం. పాములు పట్టే వారిని కూడా పిలిచాం. కానీ ఫలితం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More: