సుశాంత్ కేసు, ముంబైలో ముగ్గురు డ్రగ్ సెల్లర్స్ అరెస్ట్
సుశాంత్ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం ముంబైలో పలు అనుమానిత డ్రగ్ కేంద్రాలపై దాడులు చేశారు. ముగ్గురు డ్రగ్ సెల్లర్స్ ని..
సుశాంత్ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం ముంబైలో పలు అనుమానిత డ్రగ్ కేంద్రాలపై దాడులు చేశారు. ముగ్గురు డ్రగ్ సెల్లర్స్ ని అరెస్టు చేసి వారిని ఇన్వెస్టిగేషన్ కోసం తమ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఈ సంస్థ క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పట్టుబడిన ముగ్గురిలో ఎవరైనా ఆమెకు గానీ, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి గానీ డ్రగ్స్ అందజేశారా అన్న విషయాన్ని కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
సుశాంత్ కేసుకు సంబంధించి ఇప్పటికే రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో బాటు ఈడీ, సీబీఐ కూడా ఇంటరాగేట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో సుశాంత్ మాజీ మేనేజర్ సిద్దార్థ్ పితాని, శృతి మోడీ తదితరులను దర్యాప్తు సంస్థల అధికారులు విచారిస్తున్నారు. కాగా- బాలీవుడ్ కి, డ్రగ్ రాకెట్ కి లింక్ ఉందా అన్న విషయమై కూడా నార్కోటిక్స్ బృందం రేపో, మాపో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించవచ్చు.