ఢిల్లీలో మళ్ళీ పెరిగిన కోవిడ్ కేసులు, ప్రభుత్వ కలవరం
ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరిగాయి. రెండు నెలల తరువాత ..గత 24 గంటల్లో 2,312 కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనా రోగులు మరణించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ కేసుల..
ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరిగాయి. రెండు నెలల తరువాత ..గత 24 గంటల్లో 2,312 కేసులు నమోదయ్యాయి. 18 మంది కరోనా రోగులు మరణించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.77 లక్షలకు చేరిందని, మొత్తం 4, 462 మంది మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రీకవరీ రేటు 88.5 శాతం ఉందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. గత జులై 4 న ఒక్క రోజులో 2,505 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించాయి. ఇప్పటివరకు కేసులు తగ్గుతూ వఛ్చినా..ఒక్క రోజులో మళ్ళీ పెరగడం ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది.