ఏంటి ఈ అమ్మడు పవర్ స్టార్ పంజా మూవీ బ్యూటీనా..? నిజంగా షాక్ ఇచ్చిందిగా..!!
ఈ మధ్య పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలు తగ్గించారు. కానీ ఆయన అభిమానులను నిరాశ పరచకుండా గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో పంజా సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఫిదా చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఈ మధ్య పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలు తగ్గించారు. కానీ ఆయన అభిమానులను నిరాశ పరచకుండా గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో పంజా సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమాలో పవన్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఫిదా చేశారు. ఈ సినిమా చాలా స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా సారా జేన్ డియాస్ నటించింది అలాగా స్పెషల్ రోల్ లో జాకీ ష్రోఫ్, అడవి శేష్ నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే పంజా సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె అంజలి లవానియా..
పంజా ఆసినిమాలో ఈ చిన్నది కనిపించేది తక్కువే అయినా తన లుక్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. పంజా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లోనూ స్టెప్పులేసింది. తన అందచందాలతో కుర్రకారును కవ్వించింది అంజలి లవానియా.. పంజా సినిమాతర్వాత ఈ చిన్నది సినిమాల్లో నటించలేదు. స్వతహాగా మోడల్ అయిన ఈ బ్యూటీ కింగ్‌ఫిషర్ క్యాలెండర్ 2010, 2011లో అలాగే మేకింగ్ ఆఫ్ ది కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌ను 2011లో హోస్ట్ చేసింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందా.? అని చాలా మంది సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి.
View this post on Instagram
అంజలి లవానియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పిక్స్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
