Vijayawada: తొలిప్రేమ రీరిలీజ్.. థియేటర్ స్క్రీన్ చించేసి.. అభిమానుల బీభత్సం
శుక్రవారం పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తొలిప్రేమను రీ రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. కొన్ని చోట్ల అయితే హద్దు దాటేశారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...

బెజవాడలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తొలిప్రేమ సినిమా రీరిలీజ్ రోజున విజయవాడలోని కపర్ది థియేటర్‌లో స్క్రీన్ చించేసి, కూర్చీలు విరగ్గొట్టి నానా భీభత్సం సృష్టించారు. తొలిప్రేమ రీరిలీజ్‌తో 6 లక్షల నష్టం వాటిల్లిందని లబోదిబో మంటున్నారు థియేటర్ యజమానులు. అభిమానం ఉండాలి కానీ.. అది హద్దులు దాటకూడదు. పవన్ కల్యాణ్ లార్జర్ దెన్ లైఫ్ ఉన్న కథానాయకుడు. ఇప్పడిప్పుడే పాలిటిక్స్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ పలువురికి ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలా నలుగురితో మాటలు పడే విధంగా చేయడం కరెక్ట్ కాదనేది.. పవన్ మంచి కోరే హితులు సజీషన్.
పవన్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ మూవీ ‘తొలిప్రేమ’. ఈ మూవీ శుక్రవారం రీ-రిలీజ్ అయ్యింది. దీంతో అభిమానులు థియేర్లకు పోటెత్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ఈ సినిమా క్లిప్స్‌తో నిండిపోయాయి. అభిమానులు 25 సంవత్సరాల తర్వాత 4kలో ఈ సినిమాను ఎంజయ్ చేస్తూ.. కేకలు, స్లోగన్స్‌తో రచ్చ చేశారు. 1998లో రిలీజయిన ‘తొలి ప్రేమ’ సినిమాలో కీర్తి రెడ్డి పవన్ సరసన్ నటించింది. దర్శకుడు కరుణాకరన్‌కు ఈ సినిమాతో ఓ రేంజ్‌లో పేరు వచ్చింది. ఈ మూవీ తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును.. ఆరు రాష్ట్రాల నంది అవార్డులను గెలుచుకుంది. ‘తొలి ప్రేమ’ 21 కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడింది. 2 సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ గురించి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ ప్రత్యేకంగా మాట్లాడతారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.
