AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్‌ను రూ.1లక్షరూపాయిలకు కొన్న అభిమాని

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న చిత్రం ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమైంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఓజీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా ‘ఓజీ’ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్‌ను రూ.1లక్షరూపాయిలకు కొన్న అభిమాని
Og
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 20, 2025 | 9:26 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోలు, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

వరుసగా తొమ్మిది ఫ్లాప్స్.. క్రేజ్ మాత్రం పీక్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్

ఇదిలా ఉంటే చిత్తూరులోని ఓ యువకుడు పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. నగరంలోని రాఘవ థియేటర్‌లో ఓజీ సినిమా మొదటి టికెట్‌ను అక్షరాల లక్ష రూపాయలకు కొనుగోలు చేశాడు. ఇక ఆ లక్ష రూపాయలను పవన్ ఆఫీస్‌కు పంపించేందుకు థియేటర్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా డబ్బును పంపించేందుకు సిద్ధమైంది. మరోవైపు టికెట్‌ కొన్న అభిమాని శ్రీరామ్‌లోచన్‌ను పవన్‌ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అభిమానంతో టికెట్‌ కొనడమే కాదు… ఆ డబ్బును గ్రామాభివృద్ధి వాడాలన్న విషయం హర్షనీయం అంటున్నారు.

సౌందర్యతో పాటు నేను ఆ హెలికాఫ్టర్‌లో వెళ్ళాల్సింది.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్

ఇక ఓజీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా  ‘ఓజీ’ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ప్రీమియర్స్ షోస్ కు కూడా పర్మిషన్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఓజీ ప్రీమియర్స్ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది సర్కార్.

ఇవి కూడా చదవండి

నరకం చూపించిన దర్శకుడు.. 7సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటున్న నటి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి