AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో మీద మనసుపడితే.. చెల్లి అనేశాడు.. దెబ్బకు షాక్ అయ్యానంటున్న మహేశ్వరీ

ఆమె ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె కనిపిస్తే చాలు కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. తన ముద్దుముద్దు మాటలతో క్యూట్ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఆమె.. ఇంతకూ ఆ నటి ఎవరో తెలుసా.? ఒకప్పటి అందాల భామ మహేశ్వరీ. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుల్లో మహేశ్వరీ ఒకరు.

ఆ స్టార్ హీరో మీద మనసుపడితే.. చెల్లి అనేశాడు.. దెబ్బకు షాక్ అయ్యానంటున్న మహేశ్వరీ
Maheshvari.
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2025 | 10:52 AM

Share

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన తారలు చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయినవారి గురించి అసలు చెప్పక్కర్లేదు. రీసెంట్ డేస్ లో యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ సీనియర్ నటి సినిమాలకు దూరం అయ్యారు. ఒకానొక సమయంలో  తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలుగు వెలిగింది. కానీ పెళ్లి తర్వాత అటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు మహేశ్వరి. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ‘పెళ్లి’, ‘గులాబీ’ సినిమాల పేరు చెబితే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

మనుషుల్నిపీక్కుతిండం ఏంట్రా బాబు..! ఒకే సినిమాలో ఆరు స్టోరీలు.. దైర్యమున్నోళ్లే చూడండి

1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది ఈ క్యూట్ హీరోయిన్. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు.. క్యూట్ ఎక్స్ ప్రషన్స్ యూత్ లో యమ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దెయ్యం, మృగం, జాబిలమ్మ పెళ్లి చిత్రాల్లో నటించి అలరించింది. కానీ ఆ తర్వాత వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది మహేశ్వరి.

ఆరుగురు పిల్లల తండ్రితో ఎఫైర్.. పెళ్లి కాకుండా ఇద్దరు పిల్లలకు తల్లైంది.. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్

ప్రియరాగాలు, వీరుడు, నవ్వులాట, నీకోసం సినిమాల్లో కనిపించనుంది. 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమయ్యింది. ఇటీవల ఆమె జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ ఆసక్తిగా కామెంట్స్ చేసింది. తనకు తమిళ నటుడు అజిత్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాను .. అజిత్ పై మనసు పడ్డాను. ఆయన నా క్రష్.. అజిత్ కు ఆ విషయం చెప్పే లోగా సినిమా షూటింగ్ చివరి రోజు.. నా దగ్గరకు వచ్చి.. నీ వర్క్ నాకు బాగా నచ్చింది. నీకు ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్న నన్ను అడుగు.. నువ్వు నాకు చెల్లిలాంటిదానివి అన్నారు. దాంతో నేను షాక్ అయ్యాను అంటూ సరదాగా చెప్పారు మహేశ్వరి. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

13 ఏళ్లకు హీరోయిన్.. 19ఏళ్లకే కనబడకుండాపోయింది.. ఇప్పుడు సినిమాలు మానేసి

Ajith

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.