Pawan Kalyan: సోనూసూద్‌ టెస్ట్ డ్రైవ్ చేసిన ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో వైరల్

Pawan Kalyan: అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యణ్..

Pawan Kalyan: సోనూసూద్‌  టెస్ట్ డ్రైవ్ చేసిన ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో వైరల్
Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2021 | 9:18 PM

Pawan Kalyan: అందరి హీరోలకు అభిమానులుంటారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవన్ కళ్యణ్. ఎందుకు పవన్ ని రాజకీయాలకు అతీతంగా ఇంతగా అభిమానిస్తారు అంటే.. అయన వ్యక్తిత్వం.. సాయం చేసే గుణం అని గర్వంగా అభిమానులు చెబుతారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం అనేది ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన గుప్త దానాలు సహాయం పొందిన వాళ్ళు చెప్తే తప్ప తెలీదు. చాలామంది సాయం పొందినవారు అయా సందర్భాల్లో బయటకు వచ్చి చెబితే అపుడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తమిళనాడు లో వరదలు నిమిత్తము తనకి ఉన్న రెండో బెంజ్ కారును అమ్మి 2 కోట్లు ఇవ్వడం జరిగింది.బెంజ్ కార్లు రెండు అమ్మి స్కోడా కారుకే పరిమితం అయ్యారు. అయితే తాజాగా మళ్ళీ కాస్టిలీ కారుని కొన్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఎక్కువగా సెలబ్రెటీలు రేంజ్ రోవర్‌ ను కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు ఖరీదు కోటి నుండి అయిదు కోట్ల వరకు ఉంటుంది. తమ రేంజ్ ను బట్టి నటీనటులు రేంజ్ రోవర్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల సోనూసూద్‌ ఒక రేంజ్‌ రోవర్‌ ను టెస్ట్‌ డ్రైవ్‌ చేశాడు కదా ఆ మోడల్‌ కారును పవన్ కళ్యాన్‌ ను కొనుగోలు చేసినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ న్యూ కార్ ను హైదరాబాద్‌ లో అతి కొద్ది మంది మాత్రమే కొనుగోలు చేశారు. లిమిటెడ్‌ వర్షన్ లు అయిన ఆ కార్ల విలువ రూ.4.5 కోట్లుగా తెలుస్తోంది. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పవన్ ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

నిజానికి పవన్ కళ్యాణ్ కు కార్లు అంటే ఇంట్రెస్ట్‌ పెద్దగా ఉండదు.. అయితే ప్రస్తుతం పవన్ చేసే ప్రయాణాలు, తన అవసరాల కోసం ఆ కారును కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పీకే.. వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు తో పాటు.. రానాతో కలిసి మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. నెక్స్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Also Read: తిరుమల తీర్ధయాత్ర ఫలితం దక్కాలంటే శ్రీవారినే కాదు.. ఈ క్షేత్రంలో కొలువైన దేవేరిని దర్శించాల్సిందే..  

శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...
నాగపాము తలలో నిజంగానే మణి ఉంటుందా..? ఇదిగో వీడియో...