AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra: చెప్పుడు మాటలు విని తప్పులు చేశాను.. ఎమోషనల్ అయిన పరిణితి

ప్రస్తుతం ఈ అమ్మడు 'అమర్ సింగ్ చమ్కిలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చమ్కిలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే మరోవైపు పరిణీతి చోప్రా కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె చమ్కిలా రెండో భార్య అమర్‌జోత్‌గా నటించింది. ఈ సినిమా కోసం పరిణితి తన బరువు కూడా 15 కిలోలు పెంచుకుంది.

Parineeti Chopra: చెప్పుడు మాటలు విని తప్పులు చేశాను.. ఎమోషనల్ అయిన పరిణితి
Parineeti Chopra
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2024 | 9:05 AM

Share

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తాకకువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకొని క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికి సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చమ్కిలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే మరోవైపు పరిణీతి చోప్రా కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె చమ్కిలా రెండో భార్య అమర్‌జోత్‌గా నటించింది. ఈ సినిమా కోసం పరిణితి తన బరువు కూడా 15 కిలోలు పెంచుకుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదిలా ఉంటే, పరిణీతి చోప్రా 2012 సంవత్సరంలో తన సినీ రంగ ప్రవేశం చేసింది.  ఇషాక్‌జాదే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా నటించాడు. తన 12 ఏళ్ల కెరీర్‌లో 8 ఫ్లాప్ చిత్రాలను అందుకుంది. దీనిపై ఆమె మాట్లాడింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరిణీతి చోప్రా  మాట్లాడుతూ.. చాలా మంది తనకు తప్పుడు సలహాలు ఇచ్చారని చెప్పింది. అవి విన్నాక, అప్పట్లో నాకు కరెక్ట్ అనిపించి చాలా సినిమాలు చేశాను. అయితే, ఆ సమయంలో తనకు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదని ఆమె అంగీకరించింది. దీంతో కెరీర్‌లో ఎన్నో పొరపాట్లు దొర్లాయి.. నేడు వాటి ఫలితాన్ని చవిచూస్తున్నా అని తెలిపింది. చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అని అంటుంది పరిణితి. దానికి బదులు తన మనసులోని మాటను విని ఉంటే బహుశా తన కెరీర్‌లో పొరపాట్లు తక్కువగా ఉండేవని చెప్పింది. అయితే ఆ సమయంలో సినిమాల ఎంపికలో ట్రెండ్స్‌ని ఫాలో అవ్వమని చెప్పే వారు తక్కువ అని తెలిపింది. సినీ పరిశ్రమ గురించి నాకేమైనా తెలిసి ఉంటే ఇంతమంది మాటలు వినాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పింది.

తర్వాత ఏం చేయాలో ఇప్పుడు అర్థమైందని పరిణీతి చోప్రా తెలిపింది. ఇప్పుడు నాకు పని ఇచ్చే దర్శకులు, నిర్మాతలు కావాలి. అదే సమయంలో తన తప్పులను చూసి కాకుండా తన ప్రతిభను చూసి మాత్రమే మళ్లీ సినిమా అవకాశాలు ఇవ్వాలని అంటుంది. అయితే ఇది విన్న తర్వాత అభిమానుల షాక్ అవుతున్నారు. సోదరి ప్రియాంక చోప్రా సక్సెస్ ఫుల్ గా రాణించింది, పరిణీతి చోప్రాకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదా.? అంటూ కామెంట్స్చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?