Nani: చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన సినీ ప్రయాణం.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత బ్యా్క్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. న్యాచురల్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన సినీ ప్రయాణం.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. న్యాచురల్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ హీరో.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో నాని జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమాలో మరోసారి నాన్న పాత్రలో జీవించేశాడు నాని. అంతకు ముందు నాని నాన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న సినిమా జెర్సీ. ఈ మూవీ నాని కెరీర్ లోని బిగ్గె్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు.
జెర్సీ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 2019లో ఏప్రిల్ 19న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని.. అనేక అవార్డ్స్ గెలుచుకుంది. తండ్రి,కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీనే ఈ సినిమాను రూపొందించారు. ఉద్యోగం కోల్పోయినా.. చెదిరిన కల కోసం పోరాడే ఓ తండ్రి ఆరాటమే ఈ సినిమా. ఇందులో నాని అర్జున్ పాత్రలో నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ అయ్యి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పలు చోట్ల సినిమాకు సంబంధించి స్పెషల్ షోస్ వేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జెర్సీ సినిమాకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు నాని. జెర్సీ సినిమా స్పెషల్ షోస్ నుంచి వస్తున్న అభిమానం చూస్తే తనకి ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులను థాంక్స్ చెప్పాడు.జెర్సీ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉందని బావోద్వేగ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

