AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. హాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్న డార్లింగ్..

డార్లింగ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కోసం సోషల్ మీడియా వేదికగా నిర్మాతలకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు.

Prabhas: తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. హాలీవుడ్‌ను టార్గెట్ చేస్తున్న డార్లింగ్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2022 | 1:01 PM

Share

డార్లింగ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కోసం సోషల్ మీడియా వేదికగా నిర్మాతలకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ మూవీ అప్‌డేట్స్ ఏం లేకపోయిన… అప్‌కమింగ్ సినిమా నిర్మాత చెప్పిన న్యూస్‌ ప్రభాస్‌ అభిమానులను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ రేంజ్‌లో ఇప్పుడు వేరే లెవల్‌ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు డైహార్డ్‌ ఫ్యాన్స్‌. మన సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌ చూపించిన నటుడు ప్రభాస్‌. రీజినల్‌ కంటెంట్‌కు నేషనల్ రీచ్‌ ఉంటుందని సిల్వర్ స్క్రీన్ మీద ప్రూవ్ చేసిన డార్లింగ్‌… ఇప్పుడు ఆ ఇమేజ్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ప్రజెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఆదిపురుష్‌, సలార్‌తో పాటు ప్రాజెక్ట్ కే వర్క్‌ కూడా ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. ఆదిపురుష్ గ్లోబల్‌ మూవీ అని ఇప్పటికే కన్ఫార్మ్ చేశారు దర్శకుడు ఓం రవుత్‌. రామకథను ఐమాక్స్‌ రేంజ్‌లో రూపొందిస్తున్న ఓం… రిలీజ్ విషయంలోనూ భారీ స్కెచ్చే వేస్తున్నారు. నాట్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా… ఇంటర్నేషనల్‌ లెవల్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా రిలీజ్‌ చేయని రేంజ్‌లో చిన్న చిన్న దేశాల్లో కూడా ఆదిపురుష్‌ను డైరెక్ట్‌గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో మూవీ కూడా చేరబోతోందని చెప్పారు నిర్మాత అశ్వనీదత్‌. ప్రస్టీజియస్‌ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. నాగ్‌ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీదే ఉంది. హాలీవుడ్ రేంజ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ విషయంలో కూడా అదే ఏ రేంజ్‌ ప్లానింగ్‌లో ఉన్నారు మేకర్స్‌. ప్రాజెక్ట్ కే మూవీ మెయిన్ టార్గెట్‌ గ్లోబల్‌ ఆడియన్సే అన్నారు నిర్మాత. అవెంజర్స్‌ రేంజ్ సూపర్ హీరో కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ గ్లోబల్‌ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్న డార్లింగ్, నెక్ట్స్ టార్గెట్‌… హాలీవుడ్ సినిమానే అని హ్యాపీగా ఫీలవుతున్నారు డైహార్డ్ ఫ్యాన్స్‌. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు