AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith: టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన తల.. అజిత్ నెక్స్ట్ సినిమాలో విలన్‌గా..

తమిళ్ లోనే కాదు తెలుగులోనూ అజిత్ కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యి మంచి హిట్స్ గా నిలిచాయి. ఇటీవలే వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్.

Ajith: టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన తల.. అజిత్ నెక్స్ట్ సినిమాలో విలన్‌గా..
Ajith
Rajeev Rayala
|

Updated on: Jul 31, 2022 | 12:50 PM

Share

తమిళ్ లోనే కాదు తెలుగులోనూ అజిత్(Ajith)కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యి మంచి హిట్స్ గా నిలిచాయి. ఇటీవలే వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజిత్. ఇన్నాళ్లు తమిళ మార్కెట్‌ మాత్రమే చాలనుకున్న అజిత్ ఇప్పుడు టాలీవుడ్ మీద కూడా సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. అందుకే తన సినిమాల్లో తెలుగు స్టార్స్‌కు కీ రోల్స్‌ ఉండేలా చూసుకుంటున్నారు తల. అప్‌ కమింగ్ సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారట ఈ టాప్ హీరో. రీసెంట్‌గా వలిమై సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్, ఆ మూవీలో మెయిన్ విలన్‌గా తెలుగు యంగ్ హీరో కార్తికేయకు ఛాన్స్ ఇచ్చారు. రేసింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా కావటంతో కుర్ర హీరో అయితే తన స్పీడును మ్యాచ్‌ చేయగలుగుతారన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అజిత్‌. తెలుగు మార్కెట్ పరంగా కూడా కార్తికేయ ప్లస్ అవుతారన్నది మరో ఆలోచన.

వలిమై విషయంలో అజిత్ లెక్కలు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. తెలుగు ప్రమోషన్స్‌లో కార్తికేయ యాక్టివ్‌ పాల్గొనటంతో ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా తెలుగునాట డీసెంట్ కలెక్షన్స్‌ వచ్చాయి. అందుకే నెక్ట్స్ సినిమాకు మరింత తెలుగుదనం యాడ్ చేసే పనిలో ఉన్నారు తల. ఏకే 61లో హీరోయిన్‌గా రష్మిక పేరు వినిపిస్తోంది. ప్రజెంట్ విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న వారసుడు సినిమాలో నటిస్తున్న రష్మిక, అజిత్‌తో జోడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది పాండి బజార్‌ టాక్‌. నేషనల్ క్రష్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రష్మిక తెలుగు మార్కెట్‌లోనే కాదు.. నేషనల్‌ లెవల్‌లో అజిత్ సినిమా మీద అంచనాలు పెంచేసేందుకు హెల్ప్ అవుతాన్న ఆశతో ఉన్నారు మేకర్స్‌. లీడ్ క్యారెక్టర్స్‌కే కాదు సపోర్టింగ్ రోల్స్ విషయంలోనూ తెలుగు నటులకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు అజిత్‌. వలిమైలో కార్తికేయతో కలిసి నటించిన తల.. నెక్ట్స్ మూవీలో అజయ్‌తో తలపడేందుకు రెడీ అంటున్నారు. ఇలా టాలీవుడ్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు గట్టిగానే వర్క్ అవుట్‌ చేస్తున్నారు కోలీవుడ్ టాప్ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం