AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ నుంచి మ్యూజిక్ వీడియో రిలీజ్..

హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతను గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఈ తరహా పాత్రలకు శివన్న ఎంతగానో సరిపోతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని విడుదలైన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను ఆలపించిన అర్జున్ జన్యాపై మరోసారి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నారు.

Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' నుంచి మ్యూజిక్ వీడియో రిలీజ్..
Ghost
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2023 | 11:10 PM

Share

దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ కు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఘోస్ట్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతను గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. ఈ తరహా పాత్రలకు శివన్న ఎంతగానో సరిపోతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని విడుదలైన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను ఆలపించిన అర్జున్ జన్యాపై మరోసారి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నారు.

మ్యూజిక్ కంపోజర్‌గా అర్జున్ జన్య చాలా ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. వైవిధ్యమైన పాటలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తాజాగా ఘోస్ట్ నుంచి ‘OMG మ్యూజిక్’ విడుదలైంది. ఈ వీడియోలో కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో పూర్తి పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

యాక్షన్ సినిమాలలో BGM ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీజీఎం బాగుంటే సినిమాపై అంచనాలు పెరగడం కష్టమే. ఘోస్ట్ సినిమాలోని బీజీఎం అద్భుతంగా ఉందనడానికి ఈ పాటే నిదర్శనం. ఈ చిత్రానికి శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జోయిస్, సత్యప్రకాష్, దత్తన్న తదితరులు ముఖ్య పాత్రలో పోషించారు. సందేశ్ ప్రొడక్షన్స్ ద్వారా సందేశ్ నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేంద్ర సింగ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.