Dasara : ఓరి వారి నీది కాదురా పోరి.. క్రేజీగా నాని హార్ట్ బ్రేక్ సాంగ్ ప్రోమో..

ఈ సెకండ్ సింగిల్ వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 న విడుదల చేయనున్నట్లుగా గతంలోనే ప్రకటించారు. తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Dasara : ఓరి వారి నీది కాదురా పోరి.. క్రేజీగా నాని హార్ట్ బ్రేక్ సాంగ్ ప్రోమో..
Dasara
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2023 | 9:23 PM

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నాని పూర్తిగా ఊర మాస్ లుక్కులో కనిపించనున్నారు. మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో భారీ అంచనాలని నెలకొల్పింది. నాని మాసియస్ట్ ఫస్ట్‌లుక్‌ తో పాటు ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన దసరా టీజర్ నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ సెకండ్ సింగిల్ వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13 న విడుదల చేయనున్నట్లుగా గతంలోనే ప్రకటించారు. తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

తాజాగా విడుదలైన ఓరి వారి సాంగ్ ఆకట్టుకుంటుంది. సినిమాలో హీరో స్లాంగ్ కి తగినట్టుగానే సాహిత్యం .. ఆలాపన ఉన్నాయి. ‘ఓరి వారి నీదు గాదుర పోరి .. ఇడిసెయ్ రా ఇంగ .. ఒడిసెను దారి’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈనెల 13న పూర్తి సాంగ్ రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.

ఇందులో ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.