AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండుల్కర్‌తో ఓజీ డైరెక్టర్ సుజిత్.. షూటింగ్ కూడా పూర్తయ్యిందంట

రన్ రాజా రన్, సాహో చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుజిత్. ఇప్పుడు ఓజీతో మరోసారి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .

గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండుల్కర్‌తో ఓజీ డైరెక్టర్ సుజిత్.. షూటింగ్ కూడా పూర్తయ్యిందంట
Sujith
Rajeev Rayala
|

Updated on: Nov 07, 2025 | 5:38 PM

Share

దేశవ్యాప్తంగా విశ్వసనీయతకు ప్రతీకగా నిలుస్తున్న టెక్నో పెయింట్స్ మరో వినూత్న ప్రకటనను రూపొందించింది. భారత క్రికెట్‌కు చిరస్థాయి ప్రతిష్టను తీసుకొచ్చిన గాడ్ ఆఫ్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారితో తమ బ్రాండ్ అంబాసిడర్ గా గ్రాండ్ యాడ్ ను రూపొందించారు. ఈ ప్రకటనను పవన్ కళ్యాణ్ తో ఇటీవల OG చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రాండ్ ది ఒరిజినల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ప్రమోషనల్ ఈవెంట్స్ లో అగ్రగామి సంస్థగా పేరొందిన శ్రేయస్ మీడియా అడ్వాటైజింగ్ డివిజన్ బ్రాండ్ ఏజెన్సీ కోర్డినేటర్ గా వ్యవహారించింది. రంగులు కేవలం గోడలపై మాత్రమే కాక, మన హృదయాల్లోనూ కళాత్మక భావాలను ప్రతిబింబిస్తాయనే భావనతో రూపొందించిన ఈ ప్రకటన, ప్రజలకు మరింతగా చేరువ కావడమే ప్రధాన లక్ష్యంగా రూపొందించారు ఈ యాడ్‌ను తెరకెక్కించారు.

ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా

ఈ సందర్భంగా టెక్నో పెయింట్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ.. “భారతదేశంలో చిత్రకళాభావనను, రంగుల సంస్కృతిని కొత్త కోణంలో పరిచయం చేయాలనే మా సంకల్పానికి శ్రీ సచిన్ టెండూల్కర్ గారిలాంటి ప్రతిష్టాత్మక వ్యక్తితో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే OG చిత్ర దర్శకుడు సుజిత్ ఈ యాడ్ ను అత్యంత అద్భుతంగా గ్రాండ్ గా తీర్చిదిద్దారు.” అని తెలిపారు. తాజాగా ఈ యాడ్ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. త్వరలోనే ఈ ప్రకటన అన్ని మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది

ఇక సుజిత్ ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. జపనీస్ సమురాయ్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుజిత్ కు అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సచిన్ తో కలిసి యాడ్ షూట్ చేస్తున్నారు. అలాగే నానితో ఓ సినిమా చేస్తున్నాడు సుజిత్.

50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి