AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమానులకు షాక్ ఇచ్చిన రజనీ - కమల్‌

అభిమానులకు షాక్ ఇచ్చిన రజనీ – కమల్‌

Phani CH
|

Updated on: Nov 07, 2025 | 5:38 PM

Share

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాపై నెలకొన్న ప్రచారానికి మేకర్స్ తెరదించారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించడం లేదని, బదులుగా రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా ఓ చిత్రం రానుందని అధికారికంగా ప్రకటించారు. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 28 ఏళ్ల తర్వాత సుందర్ సి, రజినీకాంత్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

కూలీ సినిమా విడుదలైన తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా రానుందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకపోయినా, రోజుకో వార్త ఫిలిం నగర్‌లో వైరల్ అయ్యింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత లోకేష్ నటనపై దృష్టి సారించడంతో నెల్సన్ దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఈ అన్ని వదంతులకు తెరదించుతూ, మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడం లేదని స్పష్టం చేశారు. బదులుగా, రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు