
భార్య వేధింపులు తాళలేక ప్రముఖ ర్యాపర్, సింగర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బెంగుళూరులోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్ తండ్రి బిజయ్ నందా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే శవపరీక్ష కోసం అభివన్ సింగ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సమాచారం ప్రకారం అభినవ్ తన భార్యతో చాలా నెలలుగా గొడవ పడుతున్నాడు.
అభినవ్ సింగ్ ర్యాపర్ మాత్రమే కాకుండా వ్యాపారవేత్త కూడా. ఇటీవలే కొద్ది రోజుల క్రితం పని నిమిత్తం బెంగుళూరుకు చేరుకున్న అతడు.. అక్కడే నివసిస్తున్నాడు. ప్రస్తుతం అభినవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. తన భార్య కారణంగా కొన్ని నెలలుగా తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నాడు. అలాగే చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే అభినవ్ సింగ్ భార్య వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడా ? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అన్నది తెలియాల్సి ఉంది. కాగా అభినవ్ ఒడియా ర్యా్ప్ పాటలతో చాలా ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ పాటతో మరింత పాపులర్ అయ్యాడు. అలాగే అర్భన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్ ను స్థాపించాడు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన