AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

October 1st Release: ఫస్ట్‌ లుక్‌ లేదు, టైటిల్‌ లేదు.. కానీ సినిమా విడుదల తేదీని ప్రకటించారు..

October 1st Release Photo Viral: లాక్‌డౌన్‌ తర్వాత సినిమా ఇండస్ట్రీలో క్రమంగా నిబంధనలు ఎత్తేస్తున్నారు. కేంద్రం ఇస్తోన్న సడలింపుల ఆధారంగా తిరిగి చిత్ర షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. థియేటర్లు కూడా ఓపెన్‌ అవుతున్నాయి...

October 1st Release: ఫస్ట్‌ లుక్‌ లేదు, టైటిల్‌ లేదు.. కానీ సినిమా విడుదల తేదీని ప్రకటించారు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Feb 02, 2021 | 7:47 AM

Share

October 1st Release Photo Viral: లాక్‌డౌన్‌ తర్వాత సినిమా ఇండస్ట్రీలో క్రమంగా నిబంధనలు ఎత్తేస్తున్నారు. కేంద్రం ఇస్తోన్న సడలింపుల ఆధారంగా తిరిగి చిత్ర షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. థియేటర్లు కూడా ఓపెన్‌ అవుతున్నాయి. ఇక తాజాగా కేంద్రం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపించుకోవచ్చంటూ ప్రకటన జారీ చేసి విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టాలీవుడ్ దర్శక, నిర్మాతలు వరుసపెట్టి సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా బడా సినిమాలు తమ విడుదల తేదీని ప్రకటించాయి. ఇక తాజాగా విడుదల చేసిన ఓ సినిమా పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. థియేటర్‌లో ఉండే కుర్చీపై కర్చీప్ వేస్తోన్న ఫొటోతో పాటు.. అక్టోబర్‌ 1న విడుదల అనే టైటిల్‌తో కూడిన ఫొటోను పోస్ట్‌ చేశారు సదరు చిత్ర యూనిట్‌. అయితే ఆ పోస్టర్‌లో ‘సినిమా పేరు లేదు.. హీరో పిక్ లేదు.. హీరోయిన్ ఎవరో తెలియదు.. డైరెక్టర్ పేరు రాయలేదు.. ఒక బ్యానర్ లేదు.. ఫస్ట్ లుక్ వదలలేదు.. ప్రొడ్యూసర్ పేరు లేదు.. షూటింగ్ డేట్ ఫిక్స్ అవలేదు.. అందరూ రిలీజ్ డేట్ ఖర్చీఫ్ చేస్తున్నారని ఊరికి ముందే అక్టోబర్ ఒకటి రిలీజ్ అనడమేంటో’ అంటూ రాసున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ సినిమా గోపీచంద్‌, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమానే అని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమాకు సంబంధించి పూర్తి అప్‌డేట్‌ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: కత్రినా కైఫ్ ఫన్నీ వీడియో.. పొడవాటి జుత్తు ఉన్నవారి కోసం అదిరిపోయే ట్రిక్ చెప్పిన బాలీవుడ్ భామ