Jr NTR: తారక్ 30 పై క్లారిటీ వచ్చేసినట్టేనా…? సినిమా మొదలైయ్యేది అప్పుడే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. ఆయన కొత్త సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు.

Jr NTR: తారక్ 30 పై క్లారిటీ వచ్చేసినట్టేనా...? సినిమా మొదలైయ్యేది అప్పుడే
Ntr 30
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 02, 2022 | 3:10 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. ఆయన కొత్త సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తారక్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తారక్ కెరీర్ లో 30వ సినిమా గా వస్తోన్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయినా ఈ సినిమా నుంచి మొన్నామధ్య ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో విడుదలైన ఆ వీడియో ఎన్టీఆర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా గురించి క్రేజీ ఆప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ నెల 26వ తేదీన తారక్ కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు మొదలవుతాయని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు పూర్తైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఇటీవల కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా బెడిసికొట్టిన విషయం తెలిసిందే. దాంతో తారక్ సినిమాతో ఎలాగైనా మరోసారి తన సత్తా చాటాలని కసిగా ఉన్నారు కొరటాల. తారక్ కూడా రాజమౌళి మూవీ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. మరి తారక్ సినిమాతో కొరటాల తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా, బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి