Devara : ఆ టైం‌లో చచ్చిపోతానేమో అనిపించింది.. భార్య పిల్లలు గుర్తొచ్చారు.. ఎన్టీఆర్ కామెంట్స్

|

Sep 20, 2024 | 5:07 PM

సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మూవీ టీమ్. ఈక్రమంలోనే తాజాగా యంగ్ హీరోలు విష్వక్ సేన్ ,సిద్దు జొన్నల గడ్డ  ఎన్టీఆర్ ను, డైరెక్టర్ కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తారక్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

Devara : ఆ టైం‌లో చచ్చిపోతానేమో అనిపించింది.. భార్య పిల్లలు గుర్తొచ్చారు.. ఎన్టీఆర్ కామెంట్స్
Ntr
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మూవీ టీమ్. ఈక్రమంలోనే తాజాగా యంగ్ హీరోలు విష్వక్ సేన్ ,సిద్దు జొన్నల గడ్డ  ఎన్టీఆర్ ను, డైరెక్టర్ కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తారక్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దేవర సినిమా గురించి తారక్ చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముందుగా తారక్ దేవర మూవీ స్టోరీ లైన్ చెప్పేశారు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

తారక్ మాట్లాడుతూ.. ఐడియా పరంగా నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది. మాములుగా సినిమాల్లో హీరో ఎప్పుడూ జనాలకు దైర్యం ఇవ్వడానికి వస్తాడు. హీరో అనేవాడు.. భయపడుతున్న జనంలో నుంచి వచ్చి వారికి దైర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడు. వాళ్ళను ముందుకు తీసుకెళ్తాడు. కానీ దేవర సినిమాలో అలా కాదు. బాగా దైర్యం ఉండే వాళ్లకు హీరో భయం అవుతాడు. మితిమీరిన స్థాయికి దైర్యం వెళ్తే.. వాళ్లలో నుంచి ఒకడు వచ్చి. లైఫ్ లో ఇంత దైర్యం మంచిది కాదు అని ఒక లెవల్ ఆఫ్ ఫీయర్ ఉండాలి మనిషికి అని చెప్తాడు అని తారక్ అన్నారు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! శ్రీదివ్యకు ఇంత అందమైన అక్క ఉందా.! పైగా ఆమె టాలీవుడ్ హీరోయిన్ కూడా..!!

అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో గోవలో చేస్తున్నప్పుడు సముద్రంలో సీన్ చెయ్యాలి.. పైన ఎండా.. చాలా వేడిగా ఉంది. నేను తట్టుకోలేకపోయాను. నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు సూర్యుడు. అక్కడ పక్కన ఓ రూమ్ పెట్టారు. దానిలో ఏసీ ఉంది . శివ నేను వెళ్ళిపోతా అని నేను ఒక్క  షాట్ ఉంది అని శివ.. నేను తట్టుకోలేక.. నేను పోతా చచ్చిపోయేలా ఉన్నాను .. నేను చచ్చిపోతాను అనుకున్నా.. భార్య పిల్లలు ఒక్క క్షణం గుర్తొచ్చారు. నాజీవితం ఏంటి.? నేను చచ్చిపోతానా.? అని అనిపించింది. అప్పుడు అయిపొయింది ఓకే అన్నారు. అక్కడే లుంగీ తీసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రూమ్ లో డోరు మూసేశాను ఒక్క సెకన్ చల్లగా అనిపించింది. బతికాను రా అని అలా బెడ్డు మీద పడుకున్న అంతే అమ్మయ్య అనుకునేలోగా కరెంట్ పోయింది. ఫోన్ చేస్తే జనరేటర్ పాడైంది అని అన్నారు. ఆ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ ఫన్నీగా చెప్పారు తారక్. సెప్టెంబర్ 27న దేవర సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీస్‌లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది..కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.