Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ.. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడి
జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు అందులో పొందుపరిచారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడని.. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లుగా పేర్కొన్నారు.
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ టీవీ9 చేతికి చిక్కింది. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నారని పోలీసులు రిపోర్ట్‌లో రాసుకొచ్చారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పొందుపరిచారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడి చేశాడని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విషయం బయటకు చెబితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా చాన్సులు రాకుండా అడ్డుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిదని అందులో పొందుపరిచారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు (అక్టోబరు 3వరకు) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం, కోర్టులో నిజానిజాలు తేలుతాయని జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.