NTR -Pawan Kalyan : మరోసారి పవర్ స్టార్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

కంటెంట్ బాగుంటే విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇటీవలే సంక్రాంతికి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని థియేటర్స్ లోకి వచ్చాయి. వాటిలో హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య ఈ సారి వార్ జరగనుంది.

NTR -Pawan Kalyan : మరోసారి పవర్ స్టార్‌తో పోటీకి దిగుతున్న ఎన్టీఆర్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
Ntr, Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 17, 2024 | 12:33 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా హెల్దీ కాంపిటేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఒకే రోజు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం లేదా కొద్దిరోజుల గ్యాప్ లోనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంటాయి. కంటెంట్ బాగుంటే విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇటీవలే సంక్రాంతికి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని థియేటర్స్ లోకి వచ్చాయి. వాటిలో హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల మధ్య ఈ సారి వార్ జరగనుంది. గతంలోనూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో పవన్, తారక్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్య వస్తావయ్యా , పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలు పోటీ పడ్డాయి. అక్టోబర్ 11, 2013 లో రామయ్య వస్తావయ్యా రిలాజ్ కాగా.. కొద్దిరోజుల గ్యాప్ లోనే అంటే సెప్టెంబర్ 27 న అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా భారీ విజయాన్ని సొంత చేసుకుంది. ఇక ఇప్పుడు ఓజీ, దేవర సినిమాలు పోటీ పడనున్నాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే అనౌన్స్ చేశారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సుజిత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10 న విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

సుజిత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు