AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్ప‌టిదాకా అప్‌డేట్స్ లేవ్.. !

సర్కారువారిచ్చిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. సరిలేరు నీకెవ్వరూ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి కొత్త సినిమా అనౌన్స్ చేసిన సూపర్ స్టార్.. ఆ సినిమా ఫస్ట్ లుక్...

Mahesh Babu: మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్ప‌టిదాకా అప్‌డేట్స్ లేవ్.. !
Mahesh Babu
Ram Naramaneni
|

Updated on: May 28, 2021 | 9:57 PM

Share

సర్కారువారిచ్చిన షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. సరిలేరు నీకెవ్వరూ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి కొత్త సినిమా అనౌన్స్ చేసిన సూపర్ స్టార్.. ఆ సినిమా ఫస్ట్ లుక్ ని మాత్రం దాచిపెడుతూనే వస్తున్నారు. కనీసం నాన్న పుట్టినరోజుకైనా తనయుడి నుంచి సర్ ప్రైజ్ వుంటుందనుకుంటే.. అక్కడ కూడా నిట్టూర్పులే మిగిలాయి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం… ఏనాటికి ఎదురవుతుందో తెలీని ఈ అయోమయం ఇంకా ఎన్నాళ్ళు? అని ఫ్యాన్స్ ఢీలాప‌డిపోతున్నారు. ఇప్పట్లో ‘నో మోర్ అప్డేట్స్’ అంటూ.. తెగేసి చెప్పింది టీమ్ ఆఫ్ సూపర్ స్టార్. ఇప్పటికే ప్రొడ్యూసర్ హోదాలో మేజర్ మూవీ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు మహేష్ బాబు. ఇప్పుడు హీరో స్థాయిలో సర్కారువారి పాట ప్రమోషన్ కి స్టాప్ బటన్ నొక్కేశారు. టీజర్ మేకింగ్ కి కావాల్సినంత స్టఫ్ రెడీగా వున్నా.. రిలీజ్ కి ఇది సరైన సమయం కాదని వెనక్కు తగ్గింది సర్కారువారి పాట టీమ్. అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు.. రెండు పాటలు కూడా ట్యూన్ చేసి… రికార్డింగ్ వర్క్ సైతం ఫినిష్ చేసినట్లు రీసెంట్ గా చెప్పారు తమన్. కానీ.. వాటిని విని తరించే అదృష్టం మాత్రం మహేష్ ఫాన్స్ కి లేకపోయింది.

కృష్ణ ఫ్యామిలీకి దగ్గరగా వుండే సీనియర్ పీఆర్ఓ బీఏ రాజు హఠాన్మరణం కూడా సర్కారువారి పాట ప్రమోషన్ పై ఎఫెక్ట్ చూపుతోంది. అటు.. త్రివిక్రమ్ తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ రెడీగా వున్నా.. సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో లేమంటూ వెనకడుగేసింది మహేష్ టీమ్. తారక్ సినిమాను పక్కకుపెట్టిమరీ మహేష్ క్యాంపులో మళ్ళీ చేరి కొత్త మూవీ అనౌన్స్ చేస్తే… ఇక్కడ కూడా త్రివిక్రమ్ స్పీడ్ కి బ్రేకులు పడక తప్పడం లేదు.

మిగతా హీరోల టీజర్లు. వాటి రికార్డులతో సోషల్ మీడియా మోతెక్కి పోతుంటే.. చూస్తూ సైలెంట్ గా ఉండిపోవాల్సిన పరిస్థితి మహేష్ అభిమానుల‌ది. మన హీరో ఫస్ట్ లుక్ రిలీజైతే ట్వీట్లతో దండయాత్ర చేసి వీరలెవల్లో ట్రెండింగ్ లో పెడదామనుకున్న అభిమానులు ఇప్పుడు ఉస్సూరుమంటున్నారు. చెప్పుకోడానికి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో వున్నా.. వాటి నుంచి అప్డేట్స్ లేక బోసిపోయి కనిపిస్తోంది ఘట్టమనేని కాంపౌండ్. మాయదారి కరోనా ఎప్పటికి మాయమవుతుందో ఏమో? అని దిగులుప‌డిపోతున్నారు మ‌హేష్ ఫ్యాన్ప్.

Also Read: జ‌క్క‌న్న రికార్డులు చెరిపేసే ద‌మ్ము అత‌డికే ఉందా..? అత‌డో నిశ్శ‌బ్ధ యుద్ద‌మా..?

అభిమానులందరి శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది : నందమూరి రామకృష్ణ