Rang De Movie: ఓటీటీలోకి నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ.. రీలీజ్ ఎప్పుడంటే..
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ముందుగా విడుదలైంది.
Rang De Movie: యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ముందుగా విడుదలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆతరవాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగేదే అనే సినిమా చేసాడు నితిన్. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మార్చి లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్ వదిలిన దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. నితిన్ – కీర్తి జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మూవీలోని ఫన్, ఎమోషన్స్‌ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేసారు.
కీర్తి క్యారెక్టర్, నితిన్ క్యారెక్టర్ ఆడియన్స్ కుబాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాను ఇప్పుడు ఓటీటీలో వదలడానికి రంగం సిద్ధమైపోయింది. జూన్ 12వ తేదీన జీ 5లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :