Prasanth Varma: ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్ట్.. ఈసారి స్టార్ హీరోతో జాంబీరెడ్డి డైరెక్టర్ సినిమా..
ప్రశాంత్ వర్మ.. ఈ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపించింది. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నాడు.

Prasanth Varma:
ప్రశాంత్ వర్మ.. ఈ పేరు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ‘అ’ అనే సినిమాకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు. ఆతర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్ తో కల్కి సినిమా చేసాడు. ఇక మొదటి లాక్ డౌన్ తర్వాత జాంబీరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగు తెరపై మొదటిసారి జాంబీల నేపథ్యంలో సినిమా తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నాడు. త్వరలోనే జాంబీరెడ్డి సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తానని తెలిపాడు ప్రశాంత్ వర్మ. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మొదలు పెట్టేశాడని కూడా చెప్పుకుంటున్నారు.
ప్రశాంత్ వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని #PV4 ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ ఇచ్చారు. ఒక స్టార్ హీరో తో మరో ప్రాజెక్టును సెట్ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ స్టార్ హీరోకి కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు.మే 29న దర్శకుడి బర్త్ డే సందర్భంగా వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఇది ‘క్రొత్త సినీమాటిక్ యూనివర్స్’ అని మేకర్స్ ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే టాలెంటెడ్ డైరెక్టర్ మునుపటి సినిమాల మాదిరిగానే ‘#PV4’ చిత్రాన్ని కూడా న్యూ జోనర్ లో తెరకెక్కించబోతున్నట్లు అర్థం అవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :




