Nidhhi Agerwal : రెమ్యునరేషన్ పెంచేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. ‘హీరో’ సినిమాకు అమ్మడు ఎంత అందుకుందో తెలుసా..
నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో అందంతోపాటు అభినయం తోనూ ఆకట్టుకుంది ఈ అందాల భామ.
Nidhhi Agerwal : నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. మొదటి సినిమాతో అందంతోపాటు అభినయం తోనూ ఆకట్టుకుంది ఈ అందాల భామ. సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నిధి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆతర్వాత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో నటించింది ఈ భామ. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అమ్మడి క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించింది నిధి. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నిధి కి ఆఫర్లు క్యూ కట్టాయి.
ఇక ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే అక్కడ జయం రవి సరసన ఓ సినిమా శింబు సరసన ఓ సినిమా చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమాలోనూ నిధి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు నిధి భారీగా రెమ్యునరేష్ అందుకుందని తెలుస్తుంది. నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల మద్య పారితోషికం అందుకునేది. కాని హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు ఈ అమ్మడు ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తుంది.మరో వైపు బాలీవుడ్ నుంచి కూడా సినిమాలు లైన్ లో పెట్టాలని చూస్తుంది. అలాగే ఒక కోలీవుడ్ స్టార్ హీరోతో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :