AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K.G.F: Chapter 2 : యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీఎఫ్2’ కు పోటీగా ఆ స్టార్ హీరో సినిమా..?

K.G.F: Chapter 2 : ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అన్ని భాషల్లో అతని క్రేజ్ ను ఓవర్ నైట్ లోనే పెంచేసింది. ఒక్క సినిమాతో అన్ని ఇండస్ట్రీలను గడగడలాడించాడు ఈ హీరో ఇంతకు అతనెవరో అర్థమైందా

K.G.F: Chapter 2 : యాక్షన్ ఎంటర్టైనర్ 'కేజీఎఫ్2' కు పోటీగా ఆ స్టార్ హీరో సినిమా..?
Kgf 2
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2022 | 4:55 PM

Share

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అన్ని భాషల్లో అతని క్రేజ్ ను ఓవర్ నైట్ లోనే పెంచేసింది. ఒక్క సినిమాతో అన్ని ఇండస్ట్రీలను గడగడలాడించాడు ఈ హీరో ఇంతకు అతనెవరో అర్థమైందా అతడే రాకీ భాయ్ యశ్. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు యశ్ విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమేకాదు.. రికార్డు కలెక్షన్స్ ను కూడా దక్కించుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అత్యంత విజయాన్ని అందుకున్న భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీ సీక్వెల్‏గా కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి కరోనా బ్రేక్ వేసింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కేజీఎఫ్ 2 పై మరింత క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. 2021 ఏప్రిల్ 14న బాక్సాఫీస్ వద్ద ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే అన్ని ఇండస్ట్రీ బడా సినిమాలన్నీ ఆలోచనలో పడ్డాయి. కేజీఎఫ్ 2 సమయానికి తమ సినిమాల రిలీజ్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు స్టార్స్. అయితే బాలీవుడ్ బిగ్ మూవీ లాల్ సింగ్ చద్దా మాత్రం కేజీఎఫ్2 రిలీజ్ డేట్ లోనే రానుందని ప్రకటించి షాక్ ఇచ్చారు. నిజానికి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఫిబ్రవరిలో రావాల్సిఉంది.. కానీ ఇప్పుడు డేట్ మార్చారు. దాంతో కేజీఎఫ్ -లాల్ సింగ్ చద్దా రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.  మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా నిలబడుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu family photos: సతి సమేతంగా సంక్రాంతి సంబరాల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు .. (ఫొటోస్)

Ram Charan: ఇక పై అలాంటి సినిమాలు మరిన్ని చేస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..

Jayamma Panchayathi : కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. ఆకట్టుకుంటున్న జయమ్మ పంచాయితీ సాంగ్..