Hari Hara Veera Mallu: నిధి డెడికేషన్ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒక్క రోజులోనే ఏకంగా అన్ని ఇంటర్వ్యూలా?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటించింది. ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది.

మెగా ఫ్యాన్స్‌తో పాటు సగటు తెలుగు ప్రేక్షకులు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తోన్న చిత్రం హరి హర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండడంతో అభిమానులు వేయి కళ్లతో వీర మల్లు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నోరా ఫతేహి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 21)న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, ఏపీ, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకానున్నారని తెలుస్తోంది.
కాగా హరి హర వీరమల్లు సినిమా కోసం తెగ కష్టపడుతోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ మూవీ ఆమె కెరీర్ కు చాలా కీలకం కావడంతో ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటొంది. ఇప్పటి వరకు చిత్ర బృందం నిర్వహించిన ప్రతి ఈవెంట్ కు నిధి హాజరైంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోందీ అందాల తార. ఈ క్రమంలో ఒక్కరోజులోనే ఏకంగా 15 ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్కో మీడియా సంస్థకూ సుమారు అరగంట పాటు టైమ్ కేటాయించిన ఆమె సుమారు 8 గంటల పాటు నిరంతరాయంగా వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు నిధిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోయిన్ డెడికేషన్ సూపర్బ్ అని, పవన్ కోసం కాకపోయినా నిధి అగర్వాల్ పడిన కష్టం కోసమైనా ఈ సినిమా చూస్తామని ఇలా నెటిజన్లు కొనియాడుతున్నారు.
నీకోసమైనా సినిమా చూస్తామంటోన్న నెటిజన్లు..
Actress @AgerwalNidhhi is putting her heart and soul into promoting #HariHaraVeeraMallu, and that too single-handedly. She’s already sacrificed 5 years for this one film. She’s nothing less than a gem 💎.
Your Hardwork will Pay Off Nidhhi ❤️ pic.twitter.com/ozKNQVGXPB
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) July 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








