Indian 2: స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ 2 నుంచి కొత్త పోస్టర్.. ఆకట్టుకుంటున్న కమల్ లుక్

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వయసు పెరిగిన కూడా సూపర్ ఎనర్జీతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక విక్రమ్ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో కమల్ నెక్స్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కమల్ హాసన్ చాలా కాలం తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

Indian 2: స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని  ఇండియన్ 2 నుంచి కొత్త పోస్టర్.. ఆకట్టుకుంటున్న కమల్ లుక్
Indan 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2023 | 9:03 AM

యువర్సల్ హీరో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వయసు పెరిగిన కూడా సూపర్ ఎనర్జీతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక విక్రమ్ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో కమల్ నెక్స్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కమల్ హాసన్ చాలా కాలం తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఇండియన్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. అయితే అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా కమల్ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. భారీ బడ్జెట్ తో అదిరిపోయే కాన్స్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు శంకర్. అయితే ఈ మూవీ రీసెంట్ గా రీ స్టార్ట్ అయ్యింది. నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు చిత్రయూనిట్.

తాజాగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ 2 నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇండియన్ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ 90 ఏళ్ల వృదుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు శంకర్. ఇక ఇండియన్ 2 నుంచి విడుదలైన న్యూ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

శంకర్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

ఇండియన్ 2 మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.

ఇండియన్ 2 సినిమా కోసం కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..