Disha Patani: దిశాపటాని డ్రస్సింగ్ పై ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్.. మరీ ఇలా కామెంట్ చేస్తున్నారేంటీ !!
ఫ్యాషన్ సెన్స్ కాస్త ఓవర్ అయ్యిందంటే చాలు.. నెటిజన్స్ ట్రోల్స్ తో ఒక ఆట ఆడుకుంటారు. తాజాగా ట్రోలర్స్ చేతికి చిక్కింది అందాల భామ దిశాపటాని.

బాలీవుడ్ బ్యూటీస్ ఫ్యాషన్ సెన్స్‌కు గురించి అందరికి తెలిసిందే. రకరకాల డిజైనర్ వేర్ డ్రస్ లలో రెడ్ కార్పెట్ పై హొయలొకలబోస్తూ కవ్విస్తుంటారు ఈ ముద్దుగుమ్మలు. అయితే వారి డ్రసింగ్ కారణంగా కొన్ని సార్లు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఫ్యాషన్ సెన్స్ కాస్త ఓవర్ అయ్యిందంటే చాలు.. నెటిజన్స్ ట్రోల్స్ తో ఒక ఆట ఆడుకుంటారు. తాజాగా ట్రోలర్స్ చేతికి చిక్కింది అందాల భామ దిశాపటాని. దిశాపటాని టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో దిశాపటాని తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది నిత్యం.. హాట్ హాట్ ఫొటోలతో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ అమ్మడు ఫిట్నెస్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వర్కౌట్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ దిశాపటాని ఒక ఈవెంట్ లో మెరిసింది. ఈ ఈవెంట్ లో దిశా ధరించిన డ్రస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గ్రీన్ కలర్ డ్రస్ లో దర్శనమించిన దిశా పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దిశా డ్రస్ చీప్ గా ఉందని.. ఆమెకు ఫ్యాషన్ సెన్స్ లేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పూర్ ఫ్యాషన్ సెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram